Ruthwik Message / ఋత్విక్ సమాచారము ( 14-12-2021)

Ruthwik Message / ఋత్విక్ సమాచారము ( 14-12-2021)

జై శ్రీమన్నారాయణ !
శ్రీమతే రామానుజాయ నమః!

భాగవతోత్తములందరికి దాసోహములు …
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య సంకల్పంతో నిర్మితమైన శ్రీ రామానుజ సమతా మూర్తి ఆవిష్కరణను 1035 కుండాలతో విశ్వశాంతి శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగముగా ఫిభ్రవరి 02 నుండి 14 వరకు జరుపుకుంటున్నాము .

ఈ మహా యాగములో హోతలుగా పాల్గొనదలచిన వారికి తగిన శిక్షణ శ్రీ స్వామివారి ఆజ్ఞతో 14-12-2021 నుండి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఇవ్వబడుతుంది .
మీటింగ్ లింక్ మీకు 14-12-2021 సాయంత్రం 4 గంటలకు మీ ఈ-మైల్ కు పంపిస్తాము.(మీరు రిజిస్టెర్ చేసుకున్నట్టయితే) లేని పక్షములో క్రింది లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టెర్ చేసుకోగలరు :  https://divyadesams.org/ruthvik-introduction/

ఋత్విక్కులుగా నమోదు చేసుకున్న స్వాములు అందరికీ అందరికీ దాసోహం.

-> మరింత సమాచారం పొందేందుకు టెలిగ్రామ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోగలరు.
https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger

టెలిగ్రాం గ్రూప్ లో జాఇన్ అవ్వడానికి క్రింది లింక్ క్లిక్ చెయ్యండి.
https://t.me/+FhasdO-oFl9iMWRl

-> మరియు శిక్షణ తరగతుల కోసం టీమ్స్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోగలరు
https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams

ఈ శిక్షణ ద్వారా ఇప్పటివరకు వైదిక పరిచయం లేకున్నా… వారు ఋత్విక్కులుగా…, మరింత శ్రద్ధ చూపిన వారు హోతలుగా కైంకర్యమును చేయవచ్చును .
ఈ అవకాశమును వినియోగించుకుంటూ యోగ్యులైన మన శ్రీ వైష్ణవ బంధు మిత్రులను కూడా ఈ శిక్షణలో భాగస్వాములను చేయవచ్చు .

రండి ! అందరం కలిసి శ్రీ రామానుజ వైభవమును లోకమున చాటుదాం….!
మీ అందరికీ ఈ శిక్షణ తరగతులకు శుభ స్వాగతం .
జై శ్రీమన్నారాయణ!